Sunday, May 10, 2015

నీ పేరె నా స్వరమై

నీ పేరె నా స్వరమై
నీ తోనె నా జగమై
ఆనువనువు చెరి సగమై


ప్రతి రాతిరి రేరాణిలా ప్రతి ఉదయం మహరాణిల
ఏలుకొ నా సర్వస్వం నా హ్రుదయ రాణిలా
సాగిపొనీ ఈ జీవితం ఊ నిండు పున్నమిలా
ఒదిగిపొనీ నీ ఒడిలొ ఆమ్మ ఒడిన పసి పాపలా
రాలిపొనీ నీ కౌగిలిలో
                      కడలి మరుగున మలి సంధ్య సూర్యుడిలా

Saturday, May 9, 2015

జాబిల్లి కోసం ఆకషమల్లె పాట బాణికి నేను రాసుకున్న పాట

నీ రాక కోసం ఈ మూగ మనసు వేచేను విరి కోయిలై
తను పాడలేక మనసూరుకోక వచ్చేను తానె వసంతమై
                                                    || నీ రాక ||
నీ పెరె నా ఎదలో నీ ధ్యాసె నా మదిలో
             నువ్వన్నది నేనేనని ఎప్పటికైనా  
నీ రూపే నా కలలో నీ ఊపిరి నా శ్వాసలో 
             నీ ధ్యాసే నా మనసుకు ఈ క్షనమైనా 
మీఘాల తేలి ఉయాలలూగి నే ఒడిలొనే నిద్దురపొనీ 
                                                    || నీ రాక ||
నీ కొరకే నా తపమై నీ పెరే నా జపమై 
             నీ తొడే కొరాను ఏ జన్మైనా 
నువ్వన్నది నా జీవం లేవన్నది నా మరణం 
             నీ శ్వాసే నా ప్రాణం ఈ క్షణమైనా 
ఎన్నల్లైనా ఎన్నేల్లైనా నీ ప్రతిరూపం నా ఎదలోనా  
             ప్రతినిత్యం కురిపించే పువ్వుల వాన 
       
నువు లేని లోకం ఊహించలేను నే రూపు మరుగై జేవించలెను  
                                                    || నీ రాక || 

శిలను శిల్పం చేసిన శిల్పివో

శిలను శిల్పం చేసిన శిల్పివో
రాతికి కవితలు నేర్పిన రాధికవో
ప్రేమకు ప్రేమ నేర్పిన ప్రేమికవో
నా ఎద లోయలో జాలువారె కవితవో
నిదుర రాని నా కల్లలో నిదురించే స్వప్నానివో
ఎవరివో నీవెవరివో

కానరాని నిన్ను కలలొనైనా చూతమంటె 
నిదుర రాని నా కళ్ళకు కలలు కూడ కరువాయె
నేను నీ దానను కనా అని నువ్వడిగితె 
మాట రాని నా మనసు పుట్టు మూగదయ్యింది   
నీవు నా దానవె నేను నీ వాడనే అని చెప్పాలనున్నా  
మాట లేని నా మనసు మౌన గీతం పాడింది 
ఎన్నళ్ళో ఇంకెన్నాళ్ళో నా ఈ మౌన వేదన, నీకీ విరహ యాతన   

Sunday, November 17, 2013

Meri Mehjabeen

Mera khwaab hai tu, haqeeqat bhi tu
Meri pyaas hai tu, dariya bhi tu
Meri saas hai tu, dhadkan bhi tu
Meri raah hai tu, manzil bhi tu
Mujhe chhod ke na jaana sanam .....

Meri mohabbat hai tu, mehjabeen bhi tu

Thursday, November 14, 2013

MERI CHAAHAT

Chaaha tha jisko wo khuda ko manzur nahi
Paya hai jisko usey humpe aitbaar nahi
Khoya tha jisko usey bhulaa na payenge, is dard ko hum seh nahi payenge
Ye sochte hum jee nahi payenge, jise paya hai usey rulaa na payenge
Ae khuda kya zindagi hai humari, 

Chaah ke bhi mar nahi payenge, na chaah ke bhi jee nahi payenge

Monday, July 8, 2013

BORN TO WIN

Love is not something you can see, it should be felt
Heart is not something you can give or take, it should be won
Soul is not something that can be alone, it should meet it's mate
Life is not something that can be just lived, it should be shared with partner 

Life is a game, it is not just played;
you should play like you are BORN...... TO WIN.

Sunday, December 9, 2012

పడుచు సొగసు

పడుచు పైఎద సడలి పోవగ
జఘన సీమన జాలువారగ
సొగసు విందు కోరె సరసకు రావె
తనువు తాపము తీర మురిపించి పోవె

కన్నె సొయగం కమనీయ కావ్యం, కనులారా చదవనీ
ఒంపు సొంపుల సెలయేట తనివితీరా ఈదనీ
అధరాల అమౄతముతో నా దాహము తీరనీ
తడియారని బిగికౌగిలి ఈ తనువును కరగనీ

Monday, June 20, 2011

Edoo Teliyani Aalochana

edoo teliyani aalochana
deniko teliyani anveshana
gamyam leni ee payanam
udaya kanthini vetikee naa nayanam
naa antarangala edoo swaram
edoo cheyalani teliyani tapana
encheyaloo teliyani avedana
teliseneppudu aa tapana ….?? Teeredeppudu naa aavedanaa…????

Wednesday, September 29, 2010

నిదుర రాని నా నయనం

నీ పెరే నా స్వరమై

నీ తోనె నా జగమై

ఆణువణువు చెరి సగమై

ఫ్రతి రాతిరి రేరాణిలా ఫ్రతి ఉదయం మహరాణిలా

ఎలుకో నా సర్వస్వం నా హ్రుదయ రాణిలా

సాగిపొని ఈ జీవితం ఓ నిండు పున్నమిలా

ఒదిగిపొనీ నీ ఒడిలొ ఆమ్మ ఒడిన పసి పాపలా

రాలిపొనీ నీ చేతుల్లో

కడలి మరుగున మలిసంధ్య సూర్యుడిలా

నిదుర రాని నా నయనం

నీ గ్నాపకమే ప్రతి నిత్యం

మేఘమాలను అదుగనా నీ స్వరమె పలికించమని

జాబిలమ్మను కోరనా తనలో నిను చూపమని

కరుణించదె నా చెలియ కనులార చూతమన్న

జాలిగొనదే ఇసుమైన ఈ కనులే చెమరించిన

నిదుర రాని నా నయనం

నీ గ్నాపకమే ప్రతి నిత్యం

Monday, January 11, 2010

నీ కనులా కనులు కలిపి

నీ కనులా కనులు కలిపి కలకాలం ఉండిపొనీ
నను నేనే మరిచిపోయి నీలో నను కరగిపొనీ
ప్రతి ఉదయం నా తొలిచూపు మురిపించే నీ నగువవనీ
నీ స్వాసె నా స్వాసై నీ తుది స్వాసన తోడవనీ
ఆ దైవం వరమిస్తే మరుజన్మన నీ సగమవనీ

Sunday, August 9, 2009

నా రాణివి నీవా..


సిరిమువ్వకు సవ్వడి నిచ్చిన సరిగమవు నీవా....

మరు మల్లెకు పరిమళమిచ్చిన సుమగంధము నీవా...

అలకోనకు వెలుగులనిచ్చిన రేరాణివి నీవా...

నటరాజును అందియనుంచిన మయూరము నీవా...

సెలయేటికి హొయలిచ్చిన నడుమొంపులు నీవా...

విరి తేనియకు మధురిమ నిచ్చిన అధరాలు నీవా...

నా మది కొలువుండే నా రాణివి నీవా..

Thursday, February 5, 2009

సమీరమా


చిగురాకుల రెపరెప తో మురిపించె సమీరమా

అల కోయిల కిల కిలతో తిరిగొచ్చిన వసంతమా

సెలయేటి గల గలలా పొంగి పొరలు నయగారమా

చిలిపికోరిక పుట్టించే కొంటె కనుల వయారమా

చెరిగిపోని నేస్తానికి నీ చెలిమొక భాష్యమా

Thursday, October 30, 2008

పండు వెన్నెల కురిసె నిందు పున్నమి రాతిరి


పండు వెన్నెల కురిసె నిందు పున్నమి రాతిరి,

రేరాణి పరిమళాలు పిల్ల గాలులపై తేలి వస్తుంటే,

అర విరిసిన మరు మల్లెలు ఎద లోతుల తన గ్యాపకాలు .....

ఆ నవ్వు - నడుమొంపున వయ్యారం -- తన వెచ్చని ఊపిరిని గుర్తు చేస్తుంటె....

తన తోడు కొరకు ఈ తుంటరి మనసు చెసే అల్లరి....

ఎందుకంటె ఏమని చెప్పను,... అందుకే అని ఎలా చెప్పను !!!

ఫ్రతి క్షణం నా శ్వాసలో కదలడె తన ఊపిరి వెచ్చని కొరిక ఎదొ ఎదలో రెపింది,

హాయిగొలిపె ఏకాంతంలో, అపురూపమగు నా చెలిరూపం నన్నిలవనీయకుంది,

నులి వెచ్చని తన కౌగిలి చేరి కరగి పొమ్మన్నది,

పండు వెన్నెల కురిసె నిందు పున్నమి రాతిరి,

తన ఎద పై వాలి సేదతీరమన్నది.....

Monday, October 13, 2008

ప్రాణానికి ప్రాణమా

ప్రాణానికి ప్రాణమా నా ఆరో ప్రాణమా

హ్రుదయం లోని రూపమా నా ప్రేమకు ప్రతిరూపమా

నిదురలోని స్వప్నమా నా కవితకు జీవమా

కనులలోని భావమా నా ప్రేమకు తొలి భాష్యమా

కనులు మూసిన చెలి నీ రూపం

కనులు తెరిచినా నీ దరహాసం

ఎందుకు నాతో ఈ పరిహాసం

నిన్నే చూడాలని నీతో ఉండాలని

ఎదో చెయాలని ఎంతో చెప్పాలని

ఆగదు నామనసొక క్షణమైన

నిలవదు నా మది నిముసమైన

నీ ఙాపకలే నా ఊపిరై

నీ తలపులె నా జీవమై

జీవిస్తున్నా నీలోని స్వాసనై

Sunday, October 5, 2008

అంజలి

తళుకు లొలుకు కనులకు నయనాంజలి

సుధలూరె పెదవులకు అధరాంజలి

మరులూరె నగుమొముకు మొహనాంజలి

వలపులొలుకు రూపనికి మొహనాంజలి

అందుకో నీకై విరిసిన నా కవితా కుసుమాంజలి

Wednesday, September 17, 2008

అభిసారిక

నా జీవితాన విరిసిన పారిజాత సుమ మాలిక
నా గుండెలో మోగిన భావరాగ తొలి గీతిక
నా కనులలో మెదిలిన అరుణోదయ షుభ దీపిక
నీవేనా
నా హ్రుదయ వీణ మీటిన గోపిక
ఓహొ నా అభిసారిక
అందుకో నా హ్రుదయమనె విరి కానుక

Sunday, September 7, 2008

ముద్దాడ మనసాయె

మురిపించు అధరాల ముద్దాడ మనసాయె

తడి ఆరని బిగి కౌగిలి విడలెని సెగలాయె

నిను చూసిన నా కనులకు నిదరె కరువాయె

నను చేరరావె నా చెలియ .....

నువు లెని ఈ బ్రతుకు ఓపలెని బరువయె

Wednesday, September 3, 2008

గుప్పెడంత మనసు

దాచుకుంటే గుప్పెడంత
బయటపడితే ఉప్పెనంత
కాదనుకుంటే కడ చూపంత
కలసిపోతే విడలేనంత
కలలా మరిస్తె గతమంత
ఆ కలె గుర్థొస్తె కన్నీరంత

Wednesday, July 9, 2008

You are My Dream Come True


You stepped out of my dreams
and into my life,
Turning all that I had
ever hopped for into reality ....
You stepped out of my dreams
and found a way to touch my heart
like it's never been touched before......
You stepped out of my dreams
and showed me love the way it was meant to be
And now I know that you, and you alone
are the love of my life ..... only dream comes true.................

On Friendship


If
he can speak his mind
And know when to shut up.
If he can pat your back.
And kick your butt.
If he can share a hearty meal;
A good joke;
A sunset.
If he acts neither big.
Nor small.
But just medium.
And lets you be you.
Then he is the answer to your needs.

Saturday, July 5, 2008

నాతొనె అణుక్షణం ....

నెను నీవై నీవు నెనై
నాకు నువ్వై నీకు నెనై
కలసి ఉందాం కలసి పొదాం
జన్మ జన్మల చెలిమి మనదై
నువ్వు నాలొ నెను నీలొ
అంకురించిన మొదటి క్షణం
నా మదిలొ నీ మనసు సంగమించిన మరు క్షణం
నిన్ను విడిచిన ప్రతి క్షణం
నాకు తప్పదు నిరిక్షణం
ఉండలెవా ఉండిపొవా
నా ప్రాణమా నాతొనె అణుక్షణం
నాతొనె అణుక్షణం ....